విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. 350 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. మొదటిరోజు 259 మంది వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజన్న భాస్కరరావు తెలిపారు. కళాశాల యాజమాన్యం కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ధ్రువపత్రాలను పరిశీలించారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్స్, కంప్యూటర్స్ పలు విభాగాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు వివరించారు. నాలుగు రోజులపాటు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.
రెండోరోజు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ - Second day polytechnic counseling process
విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. 350 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.
![రెండోరోజు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ Second day polytechnic counseling process](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9185384-36-9185384-1602763239911.jpg)
రెండోరోజు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ