విశాఖపట్నం జిల్లాలో...
అనకాపల్లి మండలం వల్లూరు గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న వారిని త్వరలో పట్టుకుని వారిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
కృష్ణా జిల్లాలో...
రెడ్డి గూడెం మండలం అన్నేరావుపేటలో, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాటు సారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 8 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.