విశాఖపట్నం కోనాం జలాశయంలో గల్లంతయిన వ్యక్తి గురించి రెండు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. కోనాం గ్రామానికి చెందిన సింగం కల్యాణం కట్టెల కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కట్టెలు సేకరించి నాటుపడవపై తిరిగి వస్తుండగా.. నీటి ఉద్ధృతికి నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో కల్యాణం గల్లంతయ్యాడు. అప్పటినుంచి రెండు రోజులుగా స్థానికులు గాలిస్తున్నప్పటికీ.. ఫలితం లేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.
కోనాం జలాశయంలో వ్యక్తి గల్లంతు..రెండు రోజులైనా లభించని ఆచూకీ - విశాఖపట్నం జిల్లా వార్తలు
విశాఖపట్నం జిల్లలోని కోనాం జలాశయంలో గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. రెండు రోజులుగా వెతుకుతున్నా ఎలాంటి ఫలితం లేదు. చీకటి పడటంతో గాలింపును నిలిపివేసిన స్థానికులు.. తిరిగి గురువారం వెతుకుతామని పేర్కొన్నారు.
రెండు రోజులుగా గాలిస్తున్నా లభించని ఆచూకీ