Yarada Beach in AP: విశాఖ జిల్లా యారాడ వద్ద సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్డును తాకుతూ అలలు తీవ్రత పెరిగింది. యారాడ ప్రాంతంలోని మత్స్యకారులలో ఆందోళన మెుదలైంది. తీరం వెంబడి సముద్రం ఘోషించినట్లుగా వినిపిస్తోంది. సముద్ర తీరం కోతకు గురవుతోందని స్థానికులు తెలిపారు.
Yarada Beach: యారాడ వద్ద ముందుకొచ్చిన సముద్రం.. భయాందోళనలో స్థానికులు - The sea was rough in Yarada
Yarada Beach: సముద్రం ఘోషతో విశాఖ జిల్లా యారాడలోని మత్స్యకారులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అలల ఉద్ధృతికి రోడ్డు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా నివాసం ఉండే ప్రజలు, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.
Yarada Beach