ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గశిర మాస పాడ్యమి..భక్తుల సముద్ర స్నానాలు - sea bathing news

మార్గశిర మాస పాడ్యమి పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజాము నుంచి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో విశాఖ జిల్లాలోని రామకృష్ణ బీచ్​లో సందడి వాతావరణం నెలకొంది.

sea bathing
భక్తుల సముద్ర స్నానాలు

By

Published : Dec 15, 2020, 4:44 PM IST

మార్గశిర మాస పాడ్యమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్ మొదలుకొని సముద్ర తీరం అంతటా సందడి నెలకొంది. కార్తిక మాసం చివర్లో అమావాస్య తర్వాత వచ్చే పోలి పాడ్యమి సందర్భంగా సముద్ర, నదీతీరాల్లో దీపాలు వదలడం ఆనవాయితీ. మహిళలు సాగర ఒడ్డున దీపాలను వెలిగించి సూర్యభగవానుడికి అంజలి ఘటించారు. రద్దీ వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details