తీర ప్రాంత సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాన్ని చూపే దిశగా కృషి చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియో టెక్నికల్ ఇంజినీరింగ్, ఇండియన్ టెక్నికల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'స్కోర్ అండ్ ఎరోజన్' అంతర్జాతీయ కార్యశాలను వీసీ పీవీడీ ప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు. తుపాన్లు సంభవించే సమయంలో రాష్ట్రంలో తీరం కోతకు గురి అవుతోందని కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి ప్రసంగించారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడుతున్న క్రమక్షయం, నదుల్లో వంతెనల నిర్మాణం తదనంతర సమయాల్లో ఎదురవుతున్న సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని ప్రతినిధులను కోరారు.