విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లోని పాల్తేరు ప్రాంతంలో నీట మునిగిన పంటలను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సాంబశివరావు, భవానీ పరిశీలించారు. తడిసిన పంటల్లో నీరు పోయే౦దుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచించారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించే౦దుకు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నీటిపాలైన పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
నివర్ తుపాను కారణంగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో పంటలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయానికి తుపాను వచ్చిన కారణంగా.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం పంటలను పరిశీలించింది. తడిసిన పంటల్లో నీటిని తొలిగించేందుకు తగిన సూచనలను చేసింది.
పంటలను పరిశీలించిన వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం