విశాఖ మన్యం పాడేరు కేజీబీవీ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, కడుపునొప్పితో (Food Poison)ఇబ్బంది పడ్డారు. సిబ్బంది హుటాహుటిన బాధితులను పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో .... తోటి బాలికలే అస్వస్థతకు గురైన వారికి సపర్యలు చేశారు. తహసీల్దార్ ప్రకాశరావు ఆస్పత్రికి వచ్చి ఇతర ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని రప్పించారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. తాగునీటి ట్యాంకు నాచు పట్టి ఆహారంలో కలవడం వల్లే ఆహారం కలుషితం అయ్యిందని విద్యార్థినులు అంటున్నారు.