పాఠశాల బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురికి గాయాలు - school bus accident news in payakaraopeta
విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై... పాఠశాల బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన ప్రయివేట్ పాఠశాల బస్సు... విద్యార్థులతో కోటనందూరు నుంచి పాయకరావుపేట వస్తుండగా.. ప్రమాదం జరిగింది. రహదారిని దాటుతున్న సమయంలో.... వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. గాయపడిన విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
school-bus-accident-in-payakaraopeta-at-visakha