విశాఖ జిల్లా అరకులోయ చినలబుడు పంచాయతీ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో గిరి రైతులు బజ్జీ మిర్చిని సాగు చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా మిర్చి కొనేందుకు వ్యాపారులెవరూ సుముఖత చూపట్లేదని సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..
విశాఖపట్నం మిర్చి మార్కెట్కు పంటను తరలించి వెంటనే తమను ఆదుకోవాలని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదని సీపీఎం నేతలు మండిపడ్డారు. ఫలితంగా 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సీపీఎం నాయకుడు బాల్దేవ్ వివరించారు.