ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులు కేసులు ఉపసంహరించుకోవాలి' - latest news in land dealing in vizag

పట్టాదారు కుటుంబం, మహిళా సంఘం సభ్యులపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులను ఉపసంహరించుకోవాలని... ప్రగతిశీల మహళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ డిమాండ్ చేశారు.

'పోలీసులు కేసులు ఉపసంహరించుకోవాలి'

By

Published : Nov 19, 2019, 11:17 PM IST

ప్రగతిశీల మహళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ

విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగానిపాలెంలో... మేకల కాపరి కుటుంబాన్ని భూకబ్జాదారులు వేధిస్తున్నారని.. ప్రగతిశీల మహిళా సంఘం ఆరోపించింది. గ్రామంలో మేకలు కాసే లక్ష్మీ, సన్యాసిరావు దంపతులు... ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ చెప్పారు. అదే భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి వారిదే అని రెవెన్యూ అధికారులు తేల్చారని చెప్పారు. బాధితులతో పాటు, వారికి అండగా ఉన్న మహిళా సంఘంపైనా సదరు వ్యక్తులు అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. వాస్తవాలు పరిశీలించి... ఆ కేసులను పోలీసులు కొట్టేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details