ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తాండవ జలాశయం మిగులు భూములపై సాగు హక్కు కల్పించండి' - నర్సీపట్నంలో దళితుల ఆందోళన

తాండవ జలాశయం మిగులు భూములపై తమకు సాగు హక్కు కల్పించాలని కోరుతూ.. విశాఖ జిల్లా గాదంపాలెంనకు చెందిన ఎస్సీ వర్గాలు డిమాండ్ చేశాయి. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవని.. భూములిస్తే సాగు చేసుకుంటూ జీవిస్తామని తెలిపారు.

sc people protest in narsipatnam vizag district
నర్సీపట్నంలో ఆందోళన

By

Published : Aug 31, 2020, 5:34 PM IST

తాండవ జలాశయం మిగులు భూములను తమకు అప్పగించాలని.. విశాఖ జిల్లా గొలుగొండ మండలం గాదంపాలెంనకు చెందిన ఎస్సీ వర్గాల వారు డిమాండ్ చేశారు. దీనికోసం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తాండవ జలాశయం నిర్మాణ సమయంలో తాము చేపల వేటలో ఉపాధి పొందేవారమని తెలిపారు. భూములను సాగుకివ్వాలని కోరుతూ గతంలో ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేనందున మిగులు భూముల్లో సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details