ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే' - Sc St Aikya Vedhika

సుప్రీంకోర్టు, హైకోర్టులో భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మేరకు ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని బ్యాక్​ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విశాఖలో ఏపీ ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కోర్టులో న్యాయవాదుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్ల నియామకం విషయంలో 2005 జీవో ప్రకారం ప్రాధాన్యత కల్పించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ డిమాండ్స్ : మా హక్కులు మాకు రావాల్సిందే
ఎస్సీ, ఎస్టీ డిమాండ్స్ : మా హక్కులు మాకు రావాల్సిందే

By

Published : Nov 6, 2020, 9:27 PM IST

రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విశాఖలో ఏపీ ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కోర్టులో న్యాయవాదుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్ల నియామకం విషయంలో 2005 జీవో ప్రకారం ప్రాధాన్యత కల్పించాలన్నారు.

ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి..

ప్రతి జిల్లాలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట గ్రామీణ పేద ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పూర్తి మెస్ ఛార్జీలు చెల్లించాలని కోరారు.

ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని, ఎస్సీ ఎస్టీల్లో పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందేందుకు రాయితీలు కల్పించాలని స్పష్టం చేశారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, నివాసాలు కట్టుకునేందుకు సహకారించాలన్నారు.

కోర్టులకు వెళ్లడం తప్పు..

జగన్ పేదలకు అభివృద్ధి ఫలాలు అందించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే, అభివృద్ధి చూడలేని కొందరు న్యాయస్థానాలకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చారని విమర్శించారు. ఐక్య వేదిక సమన్వయకర్తలు సత్యనారాయణ, బలగా సత్యారావు, టి. రాజేష్, కే. దేవుడు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ డిమాండ్స్ : మా హక్కులు మాకు రావాల్సిందే

ఇవీ చూడండి:

ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్​లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా ?

ABOUT THE AUTHOR

...view details