విశాఖ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సత్యసాయి సేవా సంస్థ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు ముందడుగు వేసింది. విశాఖ మన్యం హుకుంపేట మండలం తడిగిరి పరిసరాల్లోని 51 కుటుంబాలకు నిత్యావసరాల కిట్టును అందజేశారు. కరోనా నేపథ్యంలో గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారని.. వారికి తమకు తోచిన విధంగా సాయపడుతున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
విశాఖ గిరిజనులకు 'సత్యసాయి' సాయం - విశాఖ గిరిజనులకు సత్యసాయి ట్రస్ట్ సహాయం తాజా వార్తలు
లాక్డౌన్ వేళ నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా స్వచ్ఛంద సంస్థలూ సాయమందిస్తున్నాయి.

విశాఖ గిరిజనులకు నిత్యావసరాలు పంచిన సత్యసాయి ట్రస్ట్