పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి స్థానానికి నామినేషన్ వేసిన తనను బెదిరించి, బలవంతంగా విత్ డ్రా చేయించారని విశాఖ జిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొబ్బాది ఈశ్వరరావు... మాడుగుల నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనితకు ఫిర్యాదు చేశారు.
కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడటంతో నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు అభ్యర్థి అధికారులకు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారి అనిత స్పందించారు. ఫిర్యాదును ఉన్నతాధికారుల పంపుతున్నట్టు చెప్పారు.