ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు.. చర్యలు తీసుకోండి' - ఎస్​ఈసీ నిమ్మగడ్డ విశాఖ పర్యటన తాజా వార్తలు

సర్పంచ్​ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాల పాలెం సర్పంచ్​గా పోటీ చేసిన అభ్యర్థి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అన్ని దొంగ ఓట్లు వేశారని.. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

complaint to sec
ఎస్​ఈసీకి సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు

By

Published : Mar 3, 2021, 10:26 AM IST

విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాల పాలెంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కొందరు తమను ఇబ్బందులకు గురి చేశారని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి బొంతు జయలక్ష్మి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డను గ్రామస్థులతో కలిసి ఎస్​ఈసీని కలిశారు.

దాదాపు 400 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు వేశారని.. అప్పటికే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వివరించారు. ఎవరూ పట్టించుకోని కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను ఆశ్రయించినట్లు బాధిత వర్గం వెల్లడించింది. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details