30 నుంచి శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు - విశాఖలో శారదా పీఠం వార్షికోత్సవాలు వార్తలు
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నాయి. పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. వార్షికోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. వార్షికోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్ధం, దేశ రక్షణార్థం పలు యాగాలను చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో పీఠం అధిష్టాన దేవతగా ఉన్న రాజ్యశ్యామల అమ్మవారి యాగంతో పాటు... తితిదే నిర్వహణలో మానవుడు ధర్మ సమ్మతమైన కోరికలు నెరవేరేందుకు చేపట్టే చతుర్వేదహవనం కూడా ఉంటుందన్నారు.
ఈనెల 30 నుంచి శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు