మారుతున్న కాలానికి భిన్నంగా ఆచార సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విశాఖ మన్యంలోని గిరిజనులు సంక్రాంతి సంబురాలు జరుపుకొంటున్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా పది రోజుల పాటు గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకొంటున్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కరోజు పండుగ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలను తమ గ్రామానికి ఆహ్వానించి వారికి విందు భోజనం ఏర్పాటు చేసి వైభవంగా పండుగ జరుపుకుంటున్నారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా సంప్రదాయ ఒరియా భాషలో పాటలు పాడుతూ హుషారుగా చిందులేస్తున్నారు.
విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ - విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ వార్తలు
గిరిజనుల పండుగలు విభిన్నం. తరతరాల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా వారు పండుగలు నిర్వహిస్తారు. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, మూడు రోజుల పండుగ అని అనుకుంటాం. కానీ..అందుకు భిన్నంగా విశాఖ మన్యంలోని గిరిజనులను సంక్రాంతి పండుగను మేళతాళాలతో పది రోజుల పాటు జరుపుకొంటారు.
![విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10363746-800-10363746-1611491967323.jpg)
విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ
విశాఖ మన్యంలో పదిరోజుల సంక్రాంతి పండుగ