ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారెవ్వా.. విశాఖ హోటళ్లలో పల్లె వాతావరణం - hotels with village culture

HOTEL CELEBRATION: సంక్రాంతి అంటేనే తెలుగుదనం ఉట్టిపడే పండుగ. సంక్రాంతి అనగానే అందరికీ పల్లెటూళ్లే గుర్తొస్తాయి. పట్టణాల్లో స్థిరపడిన వారూ వివిధ కారణాలరీత్యా స్వస్థలాలకు వెళ్లలేని వారూ చాలా మందే ఉంటారు. విశాఖలోని హోటళ్లు పల్లె వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

HOTEL CELEBRATION
HOTEL CELEBRATION

By

Published : Jan 16, 2023, 7:53 AM IST

వారెవ్వా.. విశాఖ హోటళ్లో పల్లె వాతావరణం.. సంక్రాంతి సంబరాలు

Sankranti Celebrations in Hotels : తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రతి పల్లె పట్టణాల నుంచి వచ్చినవారితో కళకళలాడుతున్నాయి. గ్రామస్థులంతా కలిసి సందడి చేస్తున్నారు. వివిధ రకాల ఆటలపోటీలు పెట్టుకుని ఎంజాయ్​ చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు, ముచ్చట్లతో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చినాపెద్దా ఉల్లాసంగా గడుపుతున్నారు. సంక్రాంతి అనగానే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేవి పల్లెటూళ్లే. అందుకే పట్టణాల్లో స్థిరపడిన వారూ పండుగ పూట సొంతూళ్లలో వాలిపోతుంటారు. వివిధ కారణాలరీత్యా స్వస్థలాలకు వెళ్లలేని వారూ చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ ఆ లోటు లేకుండా చేస్తున్నాయి విశాఖలోని హోటళ్లు. పల్లె వాతావరణంలో ఉన్నామనిపించేలా అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు రుచులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు సంప్రదాయం..తెలుగు వంటకాలతో సంక్రాంతి సంబరాలు: సంక్రాంతి అంటేనే తెలుగుదనం ఉట్టిపడే పండుగ. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. నిర్విరామ వృత్తుల్లో ఉన్నవారు, పల్లెకు వెళ్లలేకపోయామని అనుకునేవారికి ఆ అనుభూతి కల్పించాలనే ఉద్దేశంతో విశాఖలోని పలు హోటళ్లు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశాయి. పండుగ రోజుల్లో ఈ సౌకర్యం, ఆతిథ్యం, అందిస్తున్నట్టు దసపల్లా హోటల్ గ్రూప్ మేనేజర్ వెంకట్ చెబుతున్నారు. లైవ్ మ్యూజిక్ బదులు ఉత్తరాంధ్ర జానపద నృత్యాలు, తెలుగు వంటకాలతో సంక్రాంతి సంబరాల విందు వేడుక చేస్తునట్లు తెలిపారు.

సంక్రాంతి సంబరాలు దసపల్లా హోటల్ లో ఎప్పుడూ ట్రేడిషనల్ ట్రేండీ మారిపోయింది. ప్రతీదీ గ్రామ వాతావరణం పల్లె సంస్కృతి తీసుకొచ్చి అన్ని రకాలుగా విశాఖ వాసులకు డిఫెరెంట్ అనుభూతి కలిగించాలని, ఎప్పుడు ఉండే రెస్టారెంట్​లా కాకుండా ఎక్సిపిరియన్స్ కలిగించాలని ఏర్పాట్లు చేశాం. -దసపల్లా హోటల్ గ్రూప్ మేనేజర్ వెంకట్

పల్లెకు వెళ్లిన అనుభూతి:గంగిరెద్దులు, హరిదాసు కథలు, కోలాటాలు, జానపద నృత్యాలు చూస్తుంటే పల్లెకు వెళ్లిన అనుభూతి కలిగిందని వినియోగదారులు చెప్తున్నారు. మహిళలు కోరిన విధంగా ఉచితంగా మెహందీ పెట్టడంతో సంబర పడుతున్నారు. సున్నుండలు, అరిసెలు, గారెలు, బూరెలు, బెల్లం పరమాన్నం వంటి అనేక తెలుగు వంటకాలు అందించడంతో వినియోగదారులు సంతోషంగా ఆస్వాదిస్తునారు. ఈ సంక్రాంతి తెలుగు రుచులతో నిలిచి ఉంటుందని.. చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details