ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన యువకులకు ఉపాధే లక్ష్యంగా 'సంకల్పం' - గిరిజనులకు ఉద్యోగం కోసం సంకల్పం కార్యక్రమం

గిరిజ‌న యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌టమే ల‌క్ష్యంగా విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గిరిజన యువకులకు నైపుణ్యత, విద్య నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.

గిరిజన యువకులకు ఉపాధే లక్ష్యంగా 'సంకల్పం'
గిరిజన యువకులకు ఉపాధే లక్ష్యంగా 'సంకల్పం'

By

Published : Nov 28, 2020, 9:58 PM IST

గిరిజ‌న యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌టమే ల‌క్ష్యంగా విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు, ఐటీడీఏ పాడేరు వారి సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా గిరిజన యువకులకు నైపుణ్యత, విద్య నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.

120 రోజులు పాటు ఉచితంగా శిక్ష‌ణనిచ్చి ఉపాధి అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. గిరిజ‌న యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల కోసం తాము అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. కార్యక్రమాన్ని ప్రతి గిరిజన యువకుడు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉంచ‌డానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామ‌ని ఆయ‌న అన్నారు.

ABOUT THE AUTHOR

...view details