కరోనా నివారణకు కొత్తగా తయారు చేసిన శానిటైజేషన్ టన్నెళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. నివాస ప్రాంగణాలు, కార్యాలయాల, రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా శానిటైజషన్ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. రైల్వే సిబ్బంది, ఇక్కడికి వచ్చే వారు ఈ టన్నెల్ లో నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ సూచనలు మేరకు అంతర్గత వనరులు, సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజేషన్ టన్నెల్ - తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజషన్ టన్నెల్
తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఈ ఏర్పాటు చేశారు.
తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజషన్ టన్నెల్