ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - municipality workers agitation in vishaka

విశాఖ జిల్లా నర్సీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు బకాయి పడిన 18 నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తమ ఇళ్లలోనే నిరసన చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

నర్సీపట్నంలో  పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
నర్సీపట్నంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

By

Published : Aug 13, 2020, 3:04 PM IST

తమకు బకాయిపడ్డ 18 నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 18 వేల జీతం తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. ప్రమాద బీమా కల్పించాలని కోరారు. మరిన్ని ఇతర డిమాండ్లతో.. వారంతా విశాఖ జిల్లా నర్సీపట్నంలో.. రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇళ్లలో ఆందోళన చేపట్టారు.

సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో తమకు కనీసం రక్షణ కవచాలను అందజేయాలని వారు కోరారు. ప్రధానంగా పాదరక్షలు, శానిటైజర్లు, మాస్క్​లను పంపిణీ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details