విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. కార్మికులు, రైతులకు కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఛాంబర్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కర్మాగారంలో శానిటేషన్ చర్యలు చేపట్టామని.. కార్మికులకు తగు సదుపాయాలను కల్పిస్తున్నామని యాజమాన్య సంచాలకులు సన్యాసినాయుడు తెలిపారు.
చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్ ప్రారంభం - చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్ ఏర్పాటు
చక్కెర కార్మికులను, రైతులను వైరస్ నుంచి రక్షించేందుకు గోవాడ చక్కెర కర్మాగారంలో శానిటేషన్ ఛాంబర్‌ను ప్రారంభించారు. వైరస్ నాశక ద్రావణాన్ని వారిపై పిచికారీ చేస్తున్నారు.
Sanitation Chamber open at the Govada Sugar Factory in visakha district