ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: శానీటరీ సూపర్ వైజర్ ఆత్మహత్య.. బంధువుల ఆందోళన

జీవీఎంసీ పారిశుద్ద్య సూపర్​వైజర్ వడ్డాది సంతోషి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. ఆమె మృత దేహంతో గాజువాక జీవీఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

సంతోషి బంధువుల ఆందోళన
సంతోషి బంధువుల ఆందోళన

By

Published : Jul 3, 2021, 10:14 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న జీవీఎంసీ పారిశుద్ధ్య సూపర్‌వైజర్‌ వడ్డాది సంతోషి (33) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అధికారుల వేధింపుల కారణంగానే సంతోషి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సంతోషి మృతదేహంతో జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పదేళ్ల క్రితం సంతోషి భర్త మృతి చెందగా... ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details