విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు ట్రాక్టర్లు, లారీలో ఇసుకను అనుమతుల్లేకుండా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ విభీషణరావు తెలిపారు. అయితే పోలీసు స్టేషన్ ప్రధాన రహదారి అయిన బి-ఎన్ రహదారి పక్కనే ఉంది. ఇప్పటికే పట్టుకున్న ఇసుక నిల్వలతో స్టేషన్ గ్రౌండ్ నిండిపోయింది. దీంతో పట్టుబడిన ఇసుక వాహనాలను రహదారిపై పెట్టారు. దీనివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోంది. పట్టుబడిన ఇసుక నిల్వలను వేరేచోటకు తరలిస్తామని ఎస్సై తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా.. పట్టుబడిన ఇసుక నిల్వలతో నిండిన పోలీస్ గ్రౌండ్ - విశాఖలో ఇసుక అక్రమ రవాణా
విశాఖ జిల్లా చోడవరంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ ఎక్కువవుతోంది. పట్టుబడిన ఇసుక నిల్వలతో స్టేషన్ గ్రౌండ్ నిండిపోయింది. దీంతో రోడ్డుపైనే పట్టుబడిన ఇసుక వాహనాలను ఉంచడంతో ట్రాఫిక్కు సైతం అంతరాయం కలుగుతోంది.
![ఇసుక అక్రమ రవాణా.. పట్టుబడిన ఇసుక నిల్వలతో నిండిన పోలీస్ గ్రౌండ్ sand illegal transport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8775831-599-8775831-1599914778089.jpg)
sand illegal transport