ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

పెళ్లికి కానుకగా బంగారం, డబ్బు ఇవ్వటం చూస్తుంటాం. కానీ విశాఖ జిల్లాలోని ఓ వివాహానికి హాజరైన వ్యక్తి వధూవరులకు ఇసుకను కానుకగా ఇచ్చారు. దీనిపై అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

By

Published : Nov 11, 2019, 3:30 PM IST

Updated : Nov 11, 2019, 4:49 PM IST

పెళ్లిలో వధూ వరులకు కానుకగా ఇసుక

ఎవరైనా పెళ్లికి వెళ్తే కానుకగా నవ దంపతులను ఆశీర్వదిస్తూ బంగారం, గృహోపకరణ వస్తువులు కానుకగా ఇస్తారు. కానీ విశాఖ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో ఇసుకను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఓ వ్యక్తి. అనకాపల్లి మండలం కొత్త తలారి వాని పాలెంలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులకు కానుకగా ఇసుక అందజేశారు గ్రామానికి చెందిన పూర్ణ. ప్రస్తుతం ఇసుకకు ఎంత ప్రాధాన్యం ఉందో ఇలా కానుక ద్వారా ఇవ్వటంలో అర్థమవుతోందని అంటున్నారు బంధువులు.

Last Updated : Nov 11, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details