విశాఖ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్పర్సన్ సంచయిత గజపతిరాజు.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం అంతా కలియతిరిగారు. ఆలయ అర్చకులు ఆమెకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కరోనా వైరస్ గురించి తీసుకుంటున్న జాగ్రత్తలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తి సీహెచ్ ఎంఏ రాయ్ సింహాద్రి అప్పన్న దర్సనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.