ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ట్రిపుల్ ప్లే సర్వీసులకు మంచి ఆదరణ' - wall poster innovation in vizag

ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖ నగరంలో సంచార్ నిగమ్ అసోసియేషన్ సర్కిల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సమావేశాలకు సంబంధించిన గోడపత్రికను గురువారం విడుదల చేశారు.

Sanchar Nigam Circle Meetings in Visakha on March 13 and 14 in vizag
మార్చి 13, 14 తేదీల్లో విశాఖలో సంచార్ నిగమ్ సర్కిల్ సమావేశాలు

By

Published : Mar 5, 2020, 8:07 PM IST

మార్చి 13, 14 తేదీల్లో విశాఖలో సంచార్ నిగమ్ సర్కిల్ సమావేశాలు

బీఎస్ఎన్ఎల్, శ్రీదేవి ఛానల్ సంయుక్తంగా అందిస్తున్న ట్రిపుల్ ప్లే సర్వీసులకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని శ్రీదేవి కేబుల్ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు అన్నారు. ప్రైవేట్ సర్వీసులకు దీటుగా ట్రిపుల్ ప్లే సర్వీసులు భవిష్యత్తులో బలోపేతం కానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖలో సంచార్ నిగమ్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశాలకు ఏపీ సర్కిల్ సీజీఎం రాఘవ కుమార్, ప్రధాన కార్యదర్శి సెబాస్టియన్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ నెట్​వర్క్​లతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ ద్వారానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమావేశాలకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details