ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

104 ఆలయాలకు ఛైర్‌పర్సన్‌గా సంచయిత!

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆలయాలకు ఛైర్​పర్సన్​గా సంచయిత గజపతి రాజును నియమించేలా దేవాదాయశాఖ కమిషనరేట్‌ నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రూ.2లక్షల్లోపు ఆదాయమున్న 9 ఆలయాలకు ఛైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ దేవాదాయశాఖ ఉపకమిషనర్‌ ఈ నెల 2న ఆదేశాలిచ్చారు. ఈ జిల్లాలోని మిగిలిన ఆలయాలతోపాటు విశాఖ, విజయనగరం తదితర జిల్లాల్లో ఉన్న మిగిలిన ఆలయాలకు అక్కడి దేవాదాయ శాఖ అధికారులు, కొన్నింటికి ఆశాఖ కమిషనర్‌, ప్రభుత్వం ఉత్తర్వులిస్తుందని చెబుతున్నారు.

sanchaita gajapati raju
sanchaita gajapati raju

By

Published : Nov 17, 2020, 10:11 AM IST

సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆలయాలకు ఛైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమించేలా దేవాదాయశాఖ కమిషనరేట్‌ నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తనను వంశపారంపర్య ధర్మకర్తగా ప్రభుత్వం గుర్తించిందని.. సింహాచలం, మాన్సాస్‌ ట్రస్టుల ఛైర్‌పర్సన్‌గా సైతం నియమించారని.. ఈ క్రమంలో సింహాచలం పరిధిలో ఉన్న 104 ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా నియమించాలంటూ సంచయిత అక్టోబరు 27న దేవాదాయశాఖ కమిషనర్‌కు విన్నపాన్ని పంపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న దేవాదాయశాఖ అధికారులు.. ఆయా జిల్లాల పరిధిలోని సంబంధిత 104 ఆలయాలకు సంచయితను వంశపారంపర్య ధర్మకర్తగానూ, ఒకవేళ ఆ ఆలయాలకు పాలకవర్గం నియమిస్తే వాటికి ఛైర్‌పర్సన్‌గా నియమించాలని ఆదేశాలు పంపారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రూ.2లక్షల్లోపు ఆదాయమున్న 9 ఆలయాలకు ఛైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ దేవాదాయశాఖ ఉపకమిషనర్‌ (కాకినాడ) ఈ నెల 2న ఆదేశాలిచ్చారు. ఈ జిల్లాలోని మిగిలిన ఆలయాలతోపాటు విశాఖ, విజయనగరం తదితర జిల్లాల్లో ఉన్న మిగిలిన ఆలయాలకు అక్కడి దేవాదాయ శాఖ అధికారులు, కొన్నింటికి ఆశాఖ కమిషనర్‌, ప్రభుత్వం ఉత్తర్వులిస్తుందని చెబుతున్నారు. 104 ఆలయాలకు సంచయితను నియమిస్తుండటంతో ఇప్పటివరకు ఈ హోదాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును తొలగించినట్లవుతుంది.

దేవాదాయ భూముల లూటీకి యత్నం: అశోక్‌గజపతిరాజు

తూర్పుగోదావరి జిల్లా ఆలయాల సముదాయ ఛైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమించడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం బంగ్లాలో ఈనాడు/ఈటీవీతో ఆయన మాట్లాడారు. చీకటి జీవోలకిది నిదర్శనమని, దేవాలయ భూముల లూటీకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన 2 వారాల్లోగానే విభజన

ABOUT THE AUTHOR

...view details