ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలయాలపై దాడులు ఆగకుంటే.. ఆత్మగౌరవ యాత్ర చేస్తా' - విశాఖపట్నం తాజా వార్తలు

విశాఖ గోపాలపట్నంలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద.. సంప్రోక్షణ శాంతి యజ్ఞం నిర్వహించారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగటంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

విశాఖలో సంప్రోక్షణ శాంతి యజ్ఞం
విశాఖలో సంప్రోక్షణ శాంతి యజ్ఞం

By

Published : Sep 30, 2020, 3:09 PM IST

విశాఖ గోపాలపట్నంలో రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సంప్రోక్షణ శాంతి యజ్ఞం నిర్వహించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఎక్కడా పరిహార హెూమాలు, శాంతి యజ్ఞాలు నిర్వహించలేదని.. అది రాష్ట్రానికి అరిష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రులు ఈ దాడులపై రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుష్టశిక్షణ... శాంతి పరిరక్షణ కొరకు ఈ శాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా దేవాలయాలపై దాడులు కొనసాగితే సింహాచలం నుంచి అంతర్వేది వరకు హిందూ ఆత్మగౌరవ యాత్ర చేపడతానని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details