ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: శైలజానాథ్ - ap congress latest news

రైతుల మోటార్లకు నూతన మీటర్ల ఏర్పాటు కోసం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం రైతులపై భారం మోపేలా ఉందని పేర్కొన్నారు.

Sake Shilajanath Oppose new meters decision
శైలజానాథ్

By

Published : Sep 12, 2020, 11:05 PM IST

ఉచిత విద్యుత్ ఉపయోగిస్తున్న రైతుల వ్యవసాయానికి వాడే పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు విడుదల చేసిన జీవో నంబరు 22ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని... పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. విశాఖ వెళ్తున్న శైలజానాథ్​ను పాయకరావుపేట జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద... విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాల ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లాగా మారబోతుందని శైలజానాథ్ తెలిపారు. తిరుపతి జిల్లాగా మారిన తర్వాత... పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనం, ఇతర ప్రభుత్వ శాఖల భవన నిర్మాణాలతో పాటు పేద ప్రజలకు ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణాల కోసం స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details