విశాఖ సాయినార్ పరిశ్రమ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో మృతి చెందిన నరేంద్ర కుటుంబసభ్యులు కేజీహెచ్‌కి చేరుకున్నారు. మార్చురీ వద్ద కుమారుడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. కుమారుడు మరణించాడన్న కనీస సమాచారాన్ని తమకు అందించలేదని నరేంద్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమవర్గాలు, అధికారులు తమను ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కేజీహెచ్‌లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు - విశాఖ సాయినార్ గ్యాస్ లీకేజీ తాజా వార్తలు
గ్యాస్ లీకేజీ ఘటనలో తమ కుమారుడు చనిపోయాడన్న మరణవార్త ఆ కుటుంబాన్ని కుంగదీసింది. అధికారులు కనీసం ముందస్తు సమాచారం అందించలేదని ఆవేదన చెందుతున్నారు. కేజీహెచ్ వద్ద మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.
![కేజీహెచ్‌లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు sainor gas leakage victims waitting for dead body in kgh, visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7844438-846-7844438-1593598501793.jpg)
కేజీహెచ్‌లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు