కరోనా సమయంలో సేవలు అందించేందుకు విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఉచిత అంబులెన్సు సేవలు ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ అంబులెన్సును విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ఇంటి పన్నులు పెంచడం సరికాదని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని.. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి పథకాలు అమలు చేస్తే.. భవిష్యత్లో రాష్ట్ర ప్రజలే ఇబ్బంది పడతారని ప్రభుత్వాన్ని శైలజానాథ్ హెచ్చరించారు.
ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన పీసీసీ చీఫ్ శైలజానాథ్
కరోనా వేళ బాధితులకు సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విశాఖలో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడం సరికాదని ఆయన విమర్శించారు.
pcc chief sailajanath