విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని సహారా ఇండియా కార్యాలయాన్ని ఖాతాదారులు చుట్టుముట్టారు. తాము డిపాజిట్ చేసిన డబ్బుకు తక్షణమే వడ్డీతో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకిరాం పురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది నర్సీపట్నంలోని సహారా ఇండియా ఏజెంట్ల ద్వారా వివిధ రూపాల్లో డిపాజిట్లు చేశారు. అయితే ఇందులో చాలామందికి మెచ్యూరిటీ సమయం దాటినప్పటికీ చెల్లింపులు చెయ్యకపోవటంతో సిబ్బందిని నిలదీశారు. తాము రోజు కూలీ చేసుకుంటూ పొదుపు చేసుకున్న సొమ్మును ఇలా చెయ్యడం ఏంటని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
'మా సొమ్ము తిరిగివ్వండి' - సహారా ఇండియా ఖాతాదారుల న్యూస్
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని సహారా ఇండియా కార్యాలయాన్ని ఖాతాదారులు ముట్టడించారు. తమ డిపాజిట్లకు సంబంధించి మెచ్యూరిటీ సమయం గడిచి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటికీ చెల్లింపులు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Sahara India Clients agaited in narsipatnam
సహారా ఇండియా కార్యాలయం వద్ద ఖాతాదారుల ఆందోళన
ఇదీ చూడండి: '5ఏళ్లలో డబ్బు రెట్టింపంటూ,సహారా మోసం చేసింది'