ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో హిందూ సంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయి' - Srinivasananda Saraswati news

రాష్ట్రంలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని సాదు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 150 ఆలయాలపై దాడులు జరిగినా, విగ్రహాలు ధ్వంసమైనా, భూములను ఆక్రమించినా, రథాలను దహనం చేసినా, ఆభరణాలను ఎత్తుకెళ్లినా ఒక్కరినీ పట్టుకోలేదని విమర్శించారు.

Sadu Parishad state president Srinivasananda Saraswati
సాదు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి

By

Published : Aug 11, 2021, 8:30 AM IST

‘ఆంధ్రప్రదేశ్‌లో హిందువులకు, దేవాలయాలకు, వాటి భూములకు, సనాతన సంప్రదాయాలకు రక్షణ లేకుండా పోయింది. దేవాదాయశాఖను తమ గుప్పిట్లో పెట్టుకుని హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంది’ అని సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. దిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 150 ఆలయాలపై దాడులు జరిగినా, విగ్రహాలు ధ్వంసమైనా, భూములను ఆక్రమించినా, రథాలను దహనం చేసినా, ఆభరణాలను ఎత్తుకెళ్లినా ఒక్కరినీ పట్టుకోలేదు. అంతర్వేదిలో చర్చి రెండు అద్దాలు పగిలితే 40 మందిని అరెస్టు చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాన్ని ఛిద్రం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో నంది విగ్రహాలను ఎత్తుకెళ్లారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో భూముల ఆక్రమణ

‘విశాఖలో రూ.లక్షల కోట్ల విలువైన సింహాచలం ఆలయ భూములను విజయసాయిరెడ్డి అనుచరులు ఆక్రమిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బావ అనిల్‌ కుమార్‌ బహిరంగ సభల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు కొడాలి నాని, అనిల్‌ యాదవ్‌లు హిందూ సంప్రదాయాలను వెక్కిరించేలా మాట్లాడుతున్నారు. హిందూ ఆలయాలు, సంస్కృతిమీద దాడులపై పార్లమెంటులో గళం విప్పినందుకు రఘురామకృష్ణరాజుకు ఆశీస్సులు, అభినందనలు అందజేస్తున్నాం' - శ్రీనివాసానంద సరస్వతి , సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

appsc: ఏపీపీఎస్సీ నిర్వాకం... గ్రూపు-2 ఉద్యోగులకు స్థానభ్రంశం

ABOUT THE AUTHOR

...view details