ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో జరిగే దాడులకు దేవాదాయశాఖ మంత్రి బాధ్యత వహించరా.? - రామతీర్థం ఘటనపై సాధు పరిషత్ అధ్యక్షుడు ఆవేదన

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

sadhu parishadh  president srinivasananda comments on  minister vellampalli
రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి

By

Published : Jan 3, 2021, 3:36 PM IST

ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పై జరిగిన 144 దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేది, పిఠాపురం, రామతీర్ధలో దేవుళ్లపై దాడులు ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఆయన విమర్శించారు. రామతీర్ధ ఘటనలో బాధ్యత గా అశోక్ గజపతి రాజుని తొలగిస్తే ...రాష్ట్రంలో జరిగే దాడులకు దేవాదాయశాఖ మంత్రి బాధ్యత వహించరా.?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు జరగడం రాష్ట్రానికి అరిష్టమన్నారు.

ABOUT THE AUTHOR

...view details