విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమరపివానిపాలెంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనంతగిరికి చెందిన దేవబ్బాయి... గాజువాకలో నివాసముంటున్న స్నేహితుడు రామకృష్ణ వద్దకు తరచూ వస్తుండే వాడు. రామకృష్ణ ఇంటి పక్కనే నరసింహమూర్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఓ రోజు దేవబ్బాయి నరసింహమూర్తి ఇంటిలో రూ.40,000 దొంగిలించాడు. విషయం తెలుసుకున్న నరసింహమూర్తి తన డబ్బును... దేవబ్బాయే దొంగిలించాడంటూ రామకృష్ణకు జరిగింది చెప్పాడు. అనంతరం దేవబ్బాయిని తీసుకువచ్చిన రామకృష్ణ.. నరసింహమూర్తికి అప్పజెప్పాడు. దేవబ్బాయిని రెండు రోజులుగా తన ఇంట్లో బంధించిన నరసింహమూర్తి... అతన్ని గట్టిగా కొట్టడం వల్ల మరణించాడు. అనంతరం దేవబ్బాయిని గోనే సంచిలో పెట్టి సబ్బవరం తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
సబ్బవరం యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు - విశాఖ జిల్లా సబ్బవరంలో యువకుడి హత్య
విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమరపివానిపాలెంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

సబ్బవరం యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
సబ్బవరం యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఇదీ చూడండి: