ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు ఉదయం సబ్బం హరి అంత్యక్రియలు: కుమారుడు వెంకట్

విశాఖలో మంగళవారం ఉదయం 9 గంటల తర్వాత తన తండ్రి సబ్బం హరి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగానే ఆయన మరణించినట్లు వెల్లడించారు.

రేపు ఉదయం 9 తర్వాత సబ్బం హరి అంత్యక్రియలు : కుమారుడు వెంకట్
రేపు ఉదయం 9 తర్వాత సబ్బం హరి అంత్యక్రియలు : కుమారుడు వెంకట్

By

Published : May 3, 2021, 6:18 PM IST

Updated : May 3, 2021, 8:13 PM IST

విశాఖలో మంగళవారం ఉదయం 9 గంటల తర్వాత మాజీ ఎంపీ సబ్బం హరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.22 గంటలకు తమ తండ్రి తుదిశ్వాస విడిచారని ఆయన పేర్కొన్నారు.

రేపు ఉదయం 9 తర్వాత సబ్బం హరి అంత్యక్రియలు: కుమారుడు వెంకట్

లంగ్స్ ఇన్​ఫెక్షన్​ వల్లే..

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వల్లే తమ నాన్న మరణించినట్లు వెల్లడించారు. చికిత్స తర్వాత సబ్బం హరికి కొవిడ్ నెగటివ్ వచ్చిందన్నారు. తన తండ్రి సబ్బం హరి ఆరోగ్య స్థితిగతులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు నిత్యం ఆరా తీసేవారని వెంకట్ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చూడండి:

వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి: సీఎం జగన్

Last Updated : May 3, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details