Rushikonda Was Destroyed by the YSRCP Government:ఎండాడ సర్వే నంబర్లు 19/1, 19/3, 19/4లో మొత్తం 69.65 ఎకరాల్లో విశాఖ నగరానికి మణిమకుటంలా భాసిల్లే రుషికొండ విస్తరించి ఉంది. కొండపై రిసార్ట్స్ పునర్నిర్మాణం పేరిట గతంలో ఉన్న స్థలంలో కంటే అదనంగా రుషికొండ(Rushikonda)ను తవ్వేస్తున్నారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ 2021 డిసెంబరులో హైకోర్టును (Rushikonda Hill Case) ఆశ్రయించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా పిటిషన్లు వేశారు.
Over 90 Percent of the Area on Rushikonda has Construction Permits :పర్యాటకశాఖ అధికారులు 9.88 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ పునర్నిర్మాణానానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అనుమతి పొందారు. తర్వాత మోసపూరితంగా 21 ఎకరాల్లో కొండను తొలిచేశారు. National Green Tribunal (NGT), సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా తవ్వేశారు. ఇది కోర్టు ధిక్కరణ అంటూ మూర్తి యాదవ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాల్లో కేసులు ఉండగానే పర్యాటకశాఖ 61 ఎకరాల్లో నిర్మాణాలకు ప్లాను కోసం మరోసారి GVMCకి దరఖాస్తు చేసింది.
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా Greater Visakhapatnam Municipal Corporation (GVMC) ప్లాన్ మంజూరు చేసేసింది. గతంలో 5.99 ఎకరాల విస్తీర్ణంలో రిసార్టులు ఉండేవి. ఇప్పుడు అనుమతులు పొందిన విస్తీర్ణం ఏకంగా 61 ఎకరాలకు చేరుకుంది. ఈ లెక్కన ఖాళీ స్థలాల పన్ను కింద 100 కోట్ల వరకు GVMCకి చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని రెండు శాఖల అధికారులూ పట్టించుకోలేదు.
CM Jagan Decisions Danger to Rushikonda :రుషికొండ విస్తీర్ణం 69.65 ఎకరాలైతే అందులో ఏకంగా 61 ఎకరాల్లో కట్టడాలకు GVMC ప్లాను మంజూరు చేశారు. ఇది మొత్తం విస్తీర్ణంలో 90 శాతానికి పైమాటే. ప్రస్తుతం 21 ఎకరాల్లో కొండను తొలిచేశారు. భవిష్యత్తులో మిగతా 40 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే రుషికొండ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.