విశాఖ జిల్లా యలమంచిలి పట్టణంలో చేపల మార్కెట్ కు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనం చెరువు చేపల కోసం ఎగబబడ్డారు. భౌతిక దూరాన్ని మరిచి.. చేపలపైనే ఆరాటం చూపారు. ఒక పక్క కరోనా వైరస్ శరవేగంతో వ్యాప్తి చెందుతూ ఉండగా, మరో పక్క జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రజలు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చేపలను ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. వీటిని కొనడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు, వైద్యులు.. అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.
భౌతిక దూరం పక్కన పెట్టి... చేపలపైనే దృష్టి పెట్టి! - latest news of visakha fish market
చేపల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు విశాఖ జిల్లా యలమంచలి ప్రజలు. కరోనా వైరస్ సోకుతుంది.. బయటకు రావద్దు ... వచ్చినా దూరం పాటించండయ్యా అంటూ అధికారులు మొత్తుకుంటుంటే.. అవేమీ పట్టించుకోకుండా చేపల కోసం ఇలా గుంపులు గుంపులుగా చేరారు.
సామాజిక దూరం పక్కన పెట్టి...చేపలపైనే దృష్టి పెట్టి