విశాఖ ద్వారకా బస్సు కాంప్లెక్స్ వద్ద చాలా రోజుల తరువాత ప్రయాణికుల సందడి కనిపించింది. విశాఖ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను మొదలుపెట్టడం కరోనా లాక్డౌన్ అనంతరం మళ్లీ యదాస్థితి చేరుకుందనే భావన కలిగించింది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వీసులు నడుపుతుండగా విశాఖ నుంచి ఒడిశాలోని పలు జిల్లాలకు బస్సులు నడుపుతున్నారు. వీటికి ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ఆరు నెలల తరవాత అంతరాష్ట్ర బస్సు సర్వీసులు - rtc services in dwaraka bus station news update
కరోనా నిబంధనల సడలింపుతో ఆరు నెలల తరవాత విశాఖ నుంచి అంతరాష్ట్ర సర్వీసులు మొదలయ్యాయి. ఇందుకోసం అధునాతన సాంకేతిక జ్ఞానాన్ని వినియోగిస్తూ.. కొవిడ్ నియమాలు పాటిస్తూనే ప్రయాణికుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి అధికారులు.
![ఆరు నెలల తరవాత అంతరాష్ట్ర బస్సు సర్వీసులు rtc services in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8954052-770-8954052-1601172515154.jpg)
విశాఖ నుంచి పెరిగిన బస్సు సర్వీసులు
విశాఖ నుంచి పెరిగిన బస్సు సర్వీసులు
ఇక ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులకు కొవిడ్ నియమాలు సడలించడం ఇప్పటి వరకు ఏబై శాతం సీటింగ్‌తో నడిపిన బస్సులను.. ఇకపై వంద శాతం నడిచేలా రంగం సిద్ధం చేశారు. కాంప్లెక్స్ లోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి శరీర ఉష్ణోగ్రత చూడటం, చేతులకు శానిటైజ్ చేయడం మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టడం ఇలా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. స్టాండింగ్‌తో ప్రయాణించే పరిస్థితి నిషేధించి, ఉన్న సీట్లో కూర్చోవడం వరకు ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...