ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ నుంచి తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సులు - విశాఖలోని ద్వారక బస్ స్టేషన్ తాజా వార్తలు

పండగకు సొంతూళ్లకు వెళ్లి.. తిరిగి ప్రయాణమవుతున్న వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ అధికారులు చెప్పారు. 500 బస్సులు సిద్ధం చేశామన్నారు.

RTC has prepared special buses for passengers
విశాఖ నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ

By

Published : Jan 17, 2021, 12:13 PM IST

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణాలు మొదలు పెట్టారు. రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. విశాఖలోని ద్వారక బస్ స్టేషన్, మద్దిలపాలెం బస్ స్టేషన్ నుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

వారి సౌకర్యార్థం.. ఆర్టీసీ అధికారులు జిల్లా వ్యాప్తంగా అదనంగా 500 బస్సులను సిద్ధం చేశారు. రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు మరిన్ని ప్రత్యేక బస్సులను తిప్పడానికి విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రీజినల్ మేనేజర్ ఎం.వై దానం నేతృత్వంలో అధికారుల బృందం ప్రత్యేక బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details