విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ లోని దుకాణాల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెద్ద బొడ్డేపల్లి లోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే కు వినతిపత్రాన్ని అందజేశారు .
ఎమ్మెల్యేలను కలిసిన ఆర్టీసీ కాంప్లెక్స్ లోని దుకాణ యజమానులు
ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని దుకాణాల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా తమ ఆదాయం తగ్గిందని...ఈ సమయంలో అద్దెలు చెల్లించమనటం ఆర్ధికంగా భారంగా మారిందన్నారు.
దుకాణ యజమానుల వినతి
లాక్ డౌన్ కారణంగా బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు లేక ఆర్ధికంగా నష్టపోయామని...ఈ సమయంలో అద్దెలు చెల్లించమని ఒత్తిడి తగదన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారాస్తామని హమి ఇచ్చారు.
TAGGED:
latest updates in vishaka