ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన పెను ప్రమాదం - rtc bus accident in nakkapalli mandal

నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డ్రైవర్​తో సహా ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

rtc bus accident in nakkapalli mandal and 5 people injured
ఐదుగురికి గాయాలు

By

Published : Jul 5, 2020, 11:27 AM IST

విశాఖ జిల్లా ఉద్దండపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఓ బస్సు అదుపు తప్పిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పాయకరావుపేట నుంచి అనకాపల్లికి బయలుదేరిన బస్సు ఉద్దండపురం చేరుకోగానే స్టీరింగ్​ పట్టేసింది. దీంతో అదుపుతప్పి రాంగ్​రూట్​లోకి వెళ్లి రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ఎనిమిది మందిలో డ్రైవర్​ సహా ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై రామకృష్ణ, హైవే పెట్రోలింగ్​ పోలీసులతో అక్కడకు వెళ్లి బస్సులో ఉన్నవారిని బయటకు తీశారు.

గాయపడిన వారిలో డ్రైవర్​ ముత్యాల సోమరాజు, తూర్పుగోదావరి జిల్లా తొండంగి సచివాలయ పోలీసు కొండ్రం వెంకటలక్ష్మి, గోకులపాడు నుంచి భీమవరం వెళ్తున్న గుడాల సత్యవతిని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్​. విజయకుమార్​ వెల్లడించారు. బస్సుని కాలువ నుంచి క్రేన్​ సాయంతో బయటకు తీయించారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని స్థానికులంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details