గ్యాస్ లీకేజీ వలన అత్యంత నష్టపోయింది తామే అనీ.. తమ గ్రామంలోకి ఏ అధికారి రాలేదని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని అధికారులను నిలదీశారు. గ్యాస్ లీకేజీ ప్రభావం ఉన్న తమ గ్రామంలోకి ఒక్క మంత్రైనా వచ్చారా అని ప్రశ్నించారు.
గ్రామంలో ఎక్కువ మంది రైతులే ఉన్న కారణంగా.. ధాన్యమంతా ఇళ్లల్లోనే నిల్వ చేసుకున్నామన్నారు. ఇప్పుడు అది తినటానికి పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని జీవీఎంసీ అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామంలోకి వస్తేనే వారికి సమస్యలు తెలుస్తాయని చెప్పారు.