71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాల్తేర్ డివిజన్ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. శిక్షకుడు ఆదేశాలను అనుసరిస్తూ చేసిన ఫీట్లు అబ్బురపరిచాయి. సూట్‌కేసుల్లో పెట్టిన పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించటం వంటి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. శునకాలకు చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఎస్సై రాజు వివరించారు. దొంగలను పట్టుకోవటం, నేరాలు నియంత్రించటంలో ఈ శునకాలకు పలు అవార్డులు వచ్చినట్లు తెలిపారు.
ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన - వాల్తేర్ ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని వాల్తేరు డివిజన్లో ఏర్పాటు చేసిన డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు అబ్బురపరిచాయి. శిక్షకుల సూచనలు పాటిస్తూ... శునకాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
![ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన dog squad show in waltair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5851166-942-5851166-1580049912253.jpg)
వాల్తేర్‌లో డాగ్ స్క్వాడ్ ప్రదర్శన