విశాఖ కంచరపాలెంలో దారుణం జరిగింది. పైడిమాంబ అమ్మవారి ఆలయానికి సమీపంలో రౌడీషీటర్ గణగళ్ల శ్రీనివాస్ దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతని తలపై రాడ్‌తో కొట్టి.. అనంతరం మర్మాంగాన్ని కోసి హతమార్చారు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌పై రెండవ పట్టణ పీఎస్‌లో రౌడీషీట్ ఉందన్న పోలీసులు.. పలు దొంగతనాలు చేస్తూ స్క్రాప్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండేవాడని తెలిపారు. గురువారం తెల్లవారుజామున హత్య జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.
రాడ్లతో తలపై కొట్టి.. మర్మాంగాన్ని కోసేసి - కంచరపాలెంలో మర్డర్ న్యూస్
ఓ రౌడీషీటర్ దారుణ హత్య విశాఖ కంచరపాలెంలో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి.. ఆపై అతని మర్మాంగాన్ని కోసేసి చంపేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rowdy_Sheeter
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ని హతమార్చింది ఎవరన్నది ఆరా తీస్తున్నారు
ఇవీ చదవండి
యువతకు టీకా కోసం 28 నుంచి రిజిస్ట్రేషన్
Last Updated : Apr 23, 2021, 9:24 AM IST