విశాఖ మన్యం నుంచి అక్రమంగా మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
రోలుగుంట పోలీసులు ఎం కె పట్నం శివారు పెద్దపేట వద్ద వాహన తనిఖీ చేస్తుండగా.... ఈ గంజాయి పట్టుబడింది. దీంతో పాటు ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బొలెరో వాహనాన్ని, రెండు చరవాణీలను, మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.