విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌లో ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా పర్యటించారు. వివిధ యూనిట్ల పని తీరు, అవి తయారుచేసే ఉత్పత్తుల వివరాలను బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరై స్వామి ఆమెకు వివరించారు. 20వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగిన విషయమని రోజా ప్రశంసించారు. మహిళలకు కల్పిస్తున్న ఉపాధి, సదుపాయాలు, వాళ్ల పిల్లల పట్ల సంస్థ చూపే శ్రద్ధపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. చదువును మధ్యలో ఆపేసిన మహిళలకు శిక్షణ ఇచ్చి... బ్రాండిక్స్‌లో ఉపాధి కల్పిస్తున్నామని దొరైస్వామి తెలిపారు.
20వేల మందికి బ్రాండిక్స్‌లో ఉపాధి కల్పించటం ప్రశంసనీయం: రోజా - roja visited brandix in atchutapuram
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌లో ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా పర్యటించారు. 20 వేల మంది మహిళలకు సంస్థ కల్పిస్తున్న ఉపాధి, సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
బ్రాండిక్స్‌లో పర్యటించిన రోజా