కొవిడ్ రోగుల సేవలో రోబోలు భాగస్వామ్యమయ్యాయి. విశాఖలో తూర్పు నావికాదళం ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ చికిత్స కేంద్రంలో రోబోలు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. కొవిడ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా రోబోల సేవలను వినియోగిస్తున్నారు. రోబోటిక్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రోబోను రాజస్థాన్ నుంచి తెప్పించారు. అలాగే రోగులకు భోజనం, మెడిసిన్ అందించేందుకు మొబైల్ అపరేటెడ్ బ్యాటరీ వాహనాన్ని వాడుతున్నారు.
కొవిడ్ వైద్య సేవల్లో రోబోల భాగస్వామ్యం..
విశాఖలో తూర్పు నావికాదళం ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ చికిత్స కేంద్రంలో రోబోలు వైద్య సేవలు అందిస్తున్నాయి. రోబోటిక్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రోబోను రాజస్థాన్ నుంచి తెప్పించారు.
కొవిడ్ వైద్య సేవల్లో రోబోల భాగస్వామ్యం..